ACP రోహిత్ కి వినతిపత్రం అందజేసిన జనసేన

పాల్వంచ పట్టణంలో నలుగురి మృతికి కారణంగా భావిస్తున్న అనుమానితుడు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ్ ను విచారించి కఠినంగా శిక్షించాలని కోరుతూ జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ తాళ్ళూరి రామ్, సాంస్కృతిక విభాగం కార్యదర్శి శ్రీనివాస్ దుంపటి ల ఆదేశాల మేరకు ఖమ్మం ACP రోహిత్ కి వినతిపత్రం అందజేసిన జనసేనపార్టీ నాయకులు సునీల్, బ్రహ్మం, ప్రేమ్ కుమార్, వెంకటేశ్వర్లు, రాంబాబు, వేణు, దిలీప్ కుమార్, రవి తదితరులు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరడం జరిగింది.