సంగం మండలాధ్యక్షుడు రాకేష్ యాదవ్ ప్రమాణ స్వీకారం

ఆత్మకూర్, జనసేన పార్టీ ఆత్మకూర్ నియోజకవర్గ పరిధిలోని సంగం మండల అధ్యక్షుడు రాకేష్ యాదవ్ ప్రమాణ స్వీకారంకు భారీగా కార్యకర్తలు వచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ నలిశెట్టి శ్రీధర్ రాకేష్ యాదవ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు శ్రీనివాస్ భరత్, జడ్పీటీసీ అభ్యర్థి నాగరాజు యాదవ్, వార్డు మెంబర్ రవి ఉదయగిరి, కోవూరు జనసేన నాయకులు శ్రీను, రాజా, ఆత్మకూర్ టౌన్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ పత్తిపాటి, మర్రిపాడు పార్టీ కార్యకర్తలు సునీల్ యాదవ్, తదితరులు హాజరయ్యారు.