తాడిపత్రి జనసేన పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ

తాడిపత్రి నియోజకవర్గ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కదిరి శ్రీకాంత్ రెడ్డి జనసేన పార్టీ క్యాలెండర్ ను మండలాద్యక్షులు, జనసైనికుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. జనసేన క్యాలెండర్ లో జనసేన సిద్ధాంతాలను, ఆశయాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు శ్రీ కదిరి శ్రీకాంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద పప్పూరు మండల అధ్యక్షులు శ్రీ ఏర్రగంగోళ్ళ శ్రీనివాసులు, నారసింహ చారి, సాధక్, కార్తీక్, కమలహాసన్, గణేష్, గోపాల్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.