భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జనసేనాని
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/10/pawang-1024x576.jpg)
భారతీయ పండుగలన్నీ ప్రకృతి-పర్యావరణం ఆధారిత సంబరాలే! ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసుకుని రైతు మురిసిపోయే వేడుకే మన సంక్రాంతి పండుగ. ప్రకృతిపరంగా చూస్తే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే తరుణంలో వచ్చే ఈ పండుగను మకర సంక్రాంతిగా జరుపుకోవడం మనకు తెలిసిన విషయమే. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతు సౌభాగ్యవంతంగా విలసిల్లాలి. ఈ సంక్రాంతి తెలుగువారందరికీ మంచి ఆరోగ్యాన్ని, భోగభాగ్యాలను అందించాలని కోరుకుంటున్నాను. భారతీయులందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన సంక్రాంతి శుభాకాంక్షలు అని పవన్ కళ్యాణ్ తెలియచేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-14-at-6.21.14-PM-723x1024.jpeg)