ఫారెస్ట్ తో పాటు గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రభాస్

మన బాహుబలి ప్రభాస్ మనసు చాలా విశాల మైంది..మొదటి నుంచి పేదలను ఆదుకుంటూ వస్తున్న ప్రబాస్  ఇటీవల వచ్చిన కరోనా విపత్తు కారణంగా చాలా మంది ఆకలి దప్పులతో అలమటించే వారికి తన వంతు సాయాన్ని అందించారు. ఇప్పుడు కూడా మరో పెద్ద పనికి పూనుకున్నాడు.

తెలంగాణలో ప్రాముఖ్యతను సంతరించుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మూడో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభాస్. హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగురోడ్డు దగ్గరలో ఉన్న ఖాజీపల్లి అనే గ్రామంలోనీ అర్బన్ ఫారెస్ట్ 1000 ఎకరాలను దత్తత తీసుకొని ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలను నాటాడు. అయితే, దుండిగల్ సమీపంలో ఖాజీపల్లి అర్బ్ ఫారెస్ట్ బ్లాక్‌లో 1650 ఎకరాల అటవీ భూమిని ప్రభాస్ దత్తత తీసుకున్నారు. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు వెంట మరో అర్బన్ ఫారెస్ట్ పార్క్ అందుబాటులోకి రానుంది. తన తండ్రి దివంగత U.V.S. రాజు పేరు మీద అర్బన్ పార్కను అటవీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నారు. ఇప్పటివరకు 2 కోట్లను అందించిన డార్లింగ్ ఎంత ఖర్చయినా కూడా వెచ్చిస్తానని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఛాలెంజ్ కు రామ్ చరణ్, రానా, శ్రద్దా కపూర్ లను నామినేట్ చేశారు. ఇది ఇలా ఉండగా ప్రబాస్ కేవలం ఫారెస్ట్ ను మాత్రమే కాకుండా ఖాజీపల్లే లోని అర్బన్ బ్లాక్ లోని ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్ కుమార్ తో పాటుగా పలువురు మంత్రులు పాల్గొన్నారు.