గుడివాడను గోవాగా మార్చిన మంత్రి కొడాలి మాట ప్రకారం పెట్రోల్ పోసుకోవాలి: జనసేన పార్టీ డిమాండ్

తిరుపతి, శతాబ్దాల కాలంగా దేశవ్యాప్తంగా భారతీయులు, తెలుగు ప్రజలు సంక్రాంతి సంబరాలను అతి పవిత్రంగా జరుపుకొంటారు. ఈ ఏడాది సంక్రాంతి పండుగ రోజుల్లో గుడివాడలోని కొడాలి నాని కళ్యాణమండపంలో ధనమే దేయంగా, కేసినో, పేకాట ఇతరత్రా డ్యాన్స్ కార్యక్రమాలు గుడివాడలో నిర్వహించి ఆంధ్ర ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మంత్రి స్థాయిలో ఉండి ఇలా హీనంగా నడుచుకోవడం బాధాకరమని.. ఈ ఘటనను నిరూపిస్తే తాను పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానన్న కొడాలి నాని మాటను నిలబెట్టుకోవాలని… జనసేన తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్.. ప్రెస్క్లబ్లో … పెట్రోల్ క్యాన్ చేత పట్టుకొని .. వీడియో ఆధారాలతో పూర్తి సాక్షాలతో నానిని డిమాండ్ చేశారు… జనసేన నేతలు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, సుమన్ బాబు, కిషోర్, సాయి యాదవ్ తదితరులతో కలిసి కిరణ్ మాట్లాడుతూ మంత్రి స్థాయిలో ఉండి ఈ గ్యాంబ్లింగ్ కార్యక్రమాల్ని నిర్వహించి, ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరి వద్ద 10,000 వసూలు చేసి చివరికి పేకాటలో గుడ్డలు కూడా కోల్పోయి ఆటగాళ్లు పరిగెత్తే పరిస్థితికి.. నాని కారకుడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ముందు తాను ఏ పాపం చేయలేదని.. నిరూపిస్తే చస్తానని ప్రగల్భాలు పలికిన నాని….. ఏపీ ప్రజలు ఫ్లవర్లు కాదు ఫైర్లని … గెలిపించిన గుడివాడ జనమే ప్రత్యక్షంగా సంక్రాంతి సంఘటనను తెలిసినవారని… వాళ్ల చేతిలోనే నాని ఆహుతి అవుతాడని జోస్యం చెప్పారు. సులువైన చావు ఉరినా లేక పెట్రోలా నిర్ణయించుకుంటే… ఉరితాడు, పెట్రోల్ ని తాము అందిస్తామని చురకలు విసిరారు. సీఎం జగన్ ఎయిర్ పోర్టులను పెంచుతామన్నమాట సాధ్యం కాదని, తిరుపతి ఎయిర్పోర్ట్ కు వెళ్ళే దారిని రిపేర్లు చేస్తే చాలని విమర్శించారు.