మూడు రోజులపాటూ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనాలు రద్దు

కరోనా విజృంభిస్తున్న కారణంగా దేవాదాయ శాఖ ఆదేశాలతో నేటి నుంచి మూడు రోజులు పాటు ఆలయంలో భక్తుల దర్శనాలను రద్దు చేశారు. కొండ పైన, కింద కూడా వ్యాపార వాణిజ్య సముదాయాలు మూత పడ్డాయి. దీంతో యాదాద్రి పరిసరాలు బోసిపోయి కనిపించాయి. నిత్యం వేలాది భక్తజనంతో నిత్యకల్యాణం, పచ్చతోరణంలా కళకళ లాడే యాదాద్రి భక్తులు లేక నిర్మానుష్యంగా మారింది. స్వామి వారికి నిత్య కైంకార్యాలు, ఆన్ లైన్ సేవలు, ఏకాంత సేవలను భక్తులు లేకుండా అర్చకులు యథావిధిగా నిర్వహిస్తున్నారు.