జనసేన సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణ కోసం పోరాడుతున్న జనసేన ఎన్నారై యెనుముల వెంకటపతిరాజ

కోనసీమలో ఓయన్జీసీ వల్ల జరుగుతున్నటువంటి పర్యావరణ కాలుష్యాన్ని మరియు ఓయన్జీసీ సిఎస్సార్ ఫండ్స్ పక్క దారి పడుతుంటే, అడగవలసిన స్థానిక ప్రజా ప్రతినిధులు పట్టించుకోకుంటే, ఒక సామాన్య జనసైనికుడు యెనుముల వెంకటపతిరాజ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని, ఓయన్జీసీ కాలుష్యం పట్ల చెన్నైలో ఉన్న జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్ జి టి) నందు కేసు దాఖలు చేయటం జరిగింది. దాని పైన సదరు ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వటం జరిగింది. సదరు సంస్థ చేసిన కాలుష్య నివారణ చర్యలలో భాగంగా మధ్యంతర నష్టపరిహారం అదేశాలు ఇవ్వటం కూడా జరిగింది.
యెనుముల వెంకటపతిరాజ రాజోలు నియోజకవర్గం పరిధిలోని నిబద్ధత, నిజాయితీ గల జనసైనికుడు, విదేశాలలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ, తన నియోజకవర్గం పట్ల, స్థానిక సమస్యలు పట్ల, మరీ ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ విషయంలో చాలా క్రమశిక్షణ కలిగిన జనసైనికుడు. తన సొంత ఖర్చులతో పర్యావరణ పరిరక్షణ గురించి ఉన్నత న్యాయస్థానాల్లో పోరాటం చేస్తూంటాడు. ఈయన పోరాట ఫలితంగా ఓయన్జీసీ లో కదలిక మొదలైంది, పర్యావరణ పరిరక్షణకు పెద్ద పీట వేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో పైప్ లైన్ మారుస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సీఎస్ఆర్ ఫండ్స్ తో రోడ్డు మరియు మంచి నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతర దేశాలకు వెళ్లి ఉన్నతంగా స్థిరపడ్డా  వ్యక్తులు చాలా మందికి వారు పుట్టిన ఊరు కోసం, దేశం కోసం ఏదైనా చేయాలి అనే తపన అందరికి ఉంటుంది కానీ ఆచరణలో కొందరు మాత్రమే చూపిస్తారు. అలాంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి  యెనుముల వెంకటపతిరాజ. స్వదేశానికి వస్తే  ఎన్నారైలు వారి కుటుంబంతో హాయిగా గడుపుతారు, కానీ రాజా ఇక్కడికి వచ్చిన తర్వాత  గ్రామాభివృద్ధి కోసం, ఓయన్జీసీ వల్ల గ్రామములో జరుగుతున్న నష్టాలను, ప్రజలు పడుతున్నా కష్టాలను గమనించిన ఆయన ప్రజలందరినీ ఏక తాటిపై నిలిపి, తన సొంత డబ్బుని ఖర్చు పెట్టి ఓయన్జీసీ వాళ్లతో పోరాటం చేసి గ్రామాలకు రావాల్సిన నిధులను రాబడుతున్నారు. ఇటువంటి కరడుగట్టిన జనసైనికుడు వలన జనసేన పార్టీ సిథ్థాంతాలు మరింత బలోపేతం అవుతాయి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.