గడపలోకి గాజుగ్లాస్ గొల్లవారిపల్లి ఇందిరమ్మ కాలనీ

అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం, తనకల్లు మండలం గ్రామీణ యువతని, రాజకీయలవైపు నడిపించి, సమాజానికి ఆదర్శవంతమైన నాయకులను అందించడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం. జనసేనపార్టీని పార్టీని అభిమానించే వారితో పాటు ఇతర పార్టీల యువతని, ఇతర హీరోల అభిమానులను కలసి జనసేనపార్టీ సిద్ధాంతాలు తెలుపుతూ ప్రస్తుత సమాజానికి యువత రాజకీయం ఎంత అవసరమో చుట్టూ జరుగుతున్న పరిస్థితులను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి అమర్ కార్తికేయ, గొల్లవారిపల్లి యువత భాస్కర్, బాబు, రమేష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.