రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుని భాద్యత: గాదె పృథ్వి

స్టేషన్ ఘనపూర్, గణతంత్ర భారత్ లో రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుని భాద్యత అని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు గాదె పృథ్వి అన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా నియోజకవర్గ కేంద్రంలో చిన్నారులు, పార్టీ శ్రేణులతో కలిసి ఆయన జాతీయపతకావిష్కరణ చేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భారతదేశం ప్రజాస్వామ్యం దేశంగా ఉందంటే భారత రాజ్యాంగమే కారణమని పేర్కొన్నారు. అటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన పవిత్రమైన రోజు ఈ గణతంత్ర దినోత్సవమని తెలిపారు. మన దేశం గణతంత్ర రాజ్యంగా శోభిల్లాడానికి రాజ్యాంగ రూపాకల్పన చేసిన మహనీయులను ఈ సందర్బంగా స్మరించుకోవాల్సిన భాద్యత ప్రతి భారతీయుడికి ఉందన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సోదరాభావంతో ఉంటూ రాజ్యాంగానన్ని రక్షించుకోవాలని కోరారు. అంబేద్కర్ ఆశయసాధనకు జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎండీ రజాక్, మునిగెల పవన్, మేడిద ప్రశాంత్ రెడ్డి, చుక్క నవీన్, ఎండీ బషీర్, సాంబ శివ, రోహిత్, సోహెల్, రేష్మ, అజయ్, చింటూ, రాకేష్, పవన్ నాయక్, అశోక్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.