పెదపూడి మండలాన్ని విలీన ప్రతిపాదనను ప్రభుత్వం పునరాలోచించుకోవాలి: పాటంశెట్టి

రాజమహేంద్రవరం జిల్లాలో పెదపూడి మండలాన్ని విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం పునరాలోచన చేసి కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని జనసేన పెదపూడి మండల సమన్వయకర్త పాటంశెట్టి కాశీ రాణి డిమాండ్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా ప్రభుత్వ ప్రతిపాదనల నేపథ్యంలో పెదపూడి మండలం, కరకుదురు గ్రామంలో ఆమె స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. రాజమహేంద్రవరం జిల్లాలో పెదపూడి మండలాన్ని విలీనం చేయడాన్ని ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రామేశ్వరం గ్రామం నుంచి కాకినాడ కలెక్టరేట్ కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉందని అదే పెదపూడి మండలం రామేశ్వరం నుంచి రాజమహేంద్రవరానికి సుమారు 70 కిలోమీటర్ల దూరం ఉంటుందని ప్రజలు జిల్లా అధికారుల వద్దకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని వివరించారు. గతంలో సంపర నియోజకవర్గాన్ని అనపర్తిలో విలీనం చేసి మండల అభివృద్ధిని అడ్డుకున్నారని ఆరోపించారు. జిల్లాల విలీనంపై జనసేన పార్టీ గతంలో సమీక్ష నిర్వహించడం జరిగిందని, ప్రజా అభిప్రాయానికే జనసేన పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె స్పష్టం చేశారు.