రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై ధ్వజమెత్తిన జనసేన

ఏలూరు, రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానానికి వ్యతిరేకంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన పి.ఆర్.సి.కీ కోత విధించడం సరైన విధానం కాదని ప్రభుత్వ ఉద్యోగులపై వివక్ష తగదని, రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవోలను రద్దు చేయాలని జనసేన పార్టీ నుంచి రెడ్డి అప్పల నాయుడు డిమాండ్ చేశారు. గుడివాడలో పేకాట క్లబ్బులు, గోవా క్యాసీనో నిర్వహించడం, స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం సరైన విధానం కాదని రెడ్డి అప్పల నాయుడు ప్రభుత్వంపై మండి పడ్డారు. ఇవి కాక ఈ విషయాలను పక్కా దారి పట్టించడానికి 26 జిల్లాల ప్రతిపాదనలు తీసుకొచ్చి ప్రాంతాలలో చిచ్చు పెట్టడం, అలాగే ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం అయిన ఆంధ్ర రాష్ట్రం లో జిల్లాకో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడం ప్రజల మైండ్ డైవర్షన్ కీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. 2011 గణాంకాల ప్రకారం జిల్లాల విభజన చేయడానికి వీలు లేదు అన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటనను గాలికి వదిలేసి ఇంకా పూర్తి కాని 2021వ జనాభా లెక్కలను అంచనా ఎలా వేశారని రెడ్డి అప్పల నాయుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.. ఇకనైనా తమ వైఖరిని మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజలు మీకు బుధ్ధి చెప్పే రోజులు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్,నగర ఉపాధ్యక్షులు బొత్స మధు, మండల ఉపాధ్యక్షులు గుబ్బల నాగేశ్వరరావు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు పసుపులేటి దినేష్ తదితరులు పాల్గొన్నారు.