రామచంద్రపురం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన సమావేశం

రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో శనివారం రామచంద్రపురం పట్టణము ముచ్చిమిల్లి రోడ్డు శ్రీ బిల్డింగ్ ప్రక్కన గల జనసేన పార్టీ కార్యాలయంలో రామచంద్రపురం పట్టణ జనసేన నాయకులు, జనసైనికులు సమావేశం ఏర్పాటు చేసి పట్టణ జనసేన కమిటీల నిమిత్తం చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన నాయకులు జనసైనికులు పాల్గొని తమ యొక్క సలహాలు సూచనలు తెలియజేయడం జరిగింది.