జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం నో మై కాన్స్టిట్యుఎన్సి 17వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార దిశగా, పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ప్రారంభించిన నో మై కాన్స్టిట్యుఎన్సి కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాళహస్తి పట్టణంలోని తుఫాన్ సెంటర్ లో పర్యటించి ఇంటింటికి వెళ్లి ప్రజలను, పలకరించి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. కనీస అవసరాలు అయిన వీధి దీపాలు, త్రాగు నీటికి వాటర్ ట్యాంక్ లేదు, డ్రైనేజ్ కాలువలు లేవు, వీధుల్లో సీసీ రోడ్లు లేవు, మునిసిపాలిటీ పరిధిలో ఉన్న ప్రాంతం అయినా కూడా కనీసం కరెంట్ కూడా సరఫరా లేకుండా అధ్వాన స్థితిలో ఉంది. సమస్యలను మునిసిపల్ కమిషనర్ కి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లి ప్రజలకు న్యాయం జరిగేలా, సమస్యల పరిష్కారం కొరకు జనసేన పోరాడుతుందని వినుత ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు భవాని శంకర్, ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు మున్న, కరీం, ప్రమోద్, సురేష్, చందు చౌదరి, తేజా, జూలపాటి చందు, జనసైనికులు కిరణ్, ఉదయ్, సర్దార్, తదితరులు పాల్గొన్నారు.