జోగి రమేష్ అండతో పెడనలో రెచ్చిపోతున్న వైసీపీ చిల్లర బ్యాచ్

పెడన, నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక, నేను లేవనెత్తిన సమస్యలపై స్పందించే ధైర్యం లేక, మీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తున్నామనే అక్కసుతో పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తన దగ్గరున్న తన అనుచరులైన కొందరు వ్యక్తులతో నాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, చివరికి నా ఫోటోలను కూడా మార్ఫింగ్ చేసి, నా మనో ధైర్యాన్ని దెబ్బతీసి, నా వ్యక్తిగత జీవితంపై అసత్య ఆరోపణలతో కించపరచాలని ప్రయత్నిస్తున్నారు. నా ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడుతున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటో తోటమూల అడ్డ రోడ్ లో ఎవరు అడిగినా చెబుతారు. ఇది చేస్తున్న నాయకుడు యొక్క చరిత్ర ఇబ్రహీంపట్నం అడ్డారోడ్డు లో ఎవరిని అడిగినా చెబుతారు. రాజకీయంగా గాని, వ్యక్తిగతంగా కాని, నేనేదైనా తప్పు చేసినట్టు నిరూపిస్తే ప్రజాక్షేత్రంలో బహిరంగ క్షమాపణ చెప్పి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పకుండా. ఇది నా ఓపెన్ చాలెంజ్. తాగుబోతులతో జూదగాళ్లులతో, చీటర్ లతో నాపై వ్యక్తిగత దాడి చేయించినంతమాత్రాన నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. నిజానిజాలు పెడన నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. పెడన నియోజకవర్గ ప్రజా సమస్యల పోరాటం పై తగ్గేదె లేదని పెడన నియోజకవర్గ జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.