ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు

ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి కనపరచకుండా ఆధిపత్య ధోరణిలో వెళ్లింది. ఫలితంగా ఉద్యోగులకు ఊరట లభించలేదు. ఫిట్మెంట్, గత హెచ్.ఆర్.వి. కొనసాగింపు, అశుతోష్ మిశ్రా నివేదిక ఇవ్వడం లాంటి ప్రధాన డిమాండ్లతో విజయవాడలో ఉద్యోగులు ఉవ్వెత్తున చేసిన భారీ ర్యాలీ ప్రతి ఒక్కరినీ ఆలోచింపచేసింది. ఇవేవీ నెరవేరకుండానే… ఐ.ఆర్. హెచ్.ఆర్.ఏ., క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ రికవరీ నిలుపుదల అంశాన్ని పాక్షికంగా చేసినా సరే సమ్మె ఉపసంహరించుకొని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పాల్సిన పరిస్థితిని పి.ఆర్.సి. స్టీరింగ్ కమిటీ నాయకులకు ప్రభుత్వం కల్పించింది. ఈ ఉపసంహరణ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు విభేదించిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్న అంశాలను జనసిన పరిగణనలోకి తీసుకొంటుంది. ప్రభుత్వ వైఖరితో నష్టపోయిన ఉద్యోగ వర్గంపట్ల జనసేన పార్టీ సానుకూల దృక్పథాన్ని కనబరుస్తూ, వారి భావోద్వేగాలకు విలువ ఇస్తుందని జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు.