చిరు కొత్త రికార్డు.. ఇంస్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చినప్పటి నుండీ నుంచి ఏదో ఒక వార్తతో కానీ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ.. తనకు ఫ్యాన్స్ మధ్య ఉన్న అడ్డుగోడను కూల్చేశారు. అంతేకాదు ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇంకా తన తోటి నటీనటుల, ప్రముఖుల పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెబుతూ, స్పెషల్ డేలను సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నారు. చిరు లేటెస్టుగా గుండుతో ఉన్న ఫోటో పోస్ట్ చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఇంస్టాగ్రామ్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని అందుకున్నారు.