సమతామూర్తిని సందర్శించిన పవన్ కళ్యాణ్

ముచ్చింతల్ లో సమతామూర్తి భగవద్ రామానుజాచార్య విగ్రహం, అక్కడి 108 దివ్య దేశాల ఆలయాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దర్శించి పూజలు నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.