పెళ్లి బృందానికి ప్రమాదం అత్యంత శోచనీయం: పవన్ కళ్యాణ్

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి వద్ద ఆదివారం సాయంత్రం పెళ్లి బృందానికి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన తీవ్రంగా కలచివేసింది. బళ్లారిలో బిడ్డకు కన్యాదానం చేసి స్వగ్రామానికి కారులో వెళుతున్న బి.జె.పి. నాయకులు శ్రీ కోకా వెంకటప్ప నాయుడుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం దురదృష్టకరం. ఒకే కుటుంబంలోని అయిదుగురు మరణించడం మరింత బాధాకరం. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు.