పెందుర్తిని విశాఖపట్నం జిల్లాలో కాకుండా అనకాపల్లి జిల్లాలో కలపడాన్ని జనసేన తరుపున ఖండిస్తున్నాం

పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు అన్నమరెడ్డి అదీప్ రాజు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పెందుర్తి విశాఖపట్నం జిల్లాలో కొనసాగించేలాగా చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రక్రియలో రాజకీయ పార్టీ నాయకులును, స్వచ్ఛంద సంఘాలను, విద్యార్థులు, మహిళలు ఏకం చేసే దానికి నాయకత్వం వహించవలసిన బాధ్యత ఒక శాసన సభ్యుడిగా మీపై ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు సత్యనారాయణ మూర్తి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయడాన్ని జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం, ప్రభుత్వం వారు ఎటువంటి అభ్యంతరాలు ఉన్న 25/02/2022 లోపు కలెక్టర్ ఆఫీస్ లో ఉన్న ప్రభుత్వ ప్రతినిధులకు తెలియజేయాలి లేదా సోషల్ మీడియా ద్వారా దిస్త్రెఒర్గ్వ్స్ప్@గ్మైల్.చొం మీ అభ్యంతరాలు తెలియజేయవచ్చు,
కావున ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఎందుకు పెందుర్తి నియోజకవర్గంని విశాఖపట్నం జిల్లా లో ఉంచాలి అనకాపల్లి జిల్లా లో కలపడం వల్ల ఏమి కోల్పోతాం అనే విషయాలను ప్రభుత్వ ప్రతినిధులకు తెలియ చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం మొండిగా వ్యవహరించి, శాసనసభ్యులు అదీప్ రాజ్ కూడా ఈ విషయంపై చిత్తశుద్ధితో పని చేయనీఎడలా, మనమందరం అఖిలపక్షం గా ఏర్పడి ప్రజలను కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొనివద్దాం, అంతేగాని ప్రజల సమస్యను మన రాజకీయ మనుగడ కోసం ఉపయోగించకూడదని, మనమందరం ప్రజల వైపు నిలబడాలని కోరుకుంటున్నామని పెందుర్తి నియోజకవర్గ జనసేన నాయకులు వబ్బిన శ్రీకాంత్ అన్నారు.