జనగామ మెడికల్ కాలేజ్ కోసం జనసేన ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జీ నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు, జనగామ జిల్లా జేఏసి ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ మంజూరు కోసం జనగామలోని పలు కాలేజ్ లలో విద్యార్థుల మద్దతు సంతకాల సేకరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొనటం జరిగింది.