జనసేన సభలు, సమావేశాలు, ప్రదర్శనల నిర్వహణ సందర్భంగా సూచనలు విడుదల చేసిన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం

జనసేన సభలు, సమావేశాలు, ప్రదర్శనల నిర్వహణ సందర్భంగా వేదిక బ్యాక్ డ్రాప్, కటౌట్ ల కోసం ఫ్లెక్స్ ల రూపకల్పనలో ప్రోటోకాల్స్ ను పాటించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము. పార్టీ అధ్యక్షుల వారి ఫోటోను మించి మరే ఇతర ఫోటోలు పెద్దవిగా డిజైన్ చేయరాదు. పలుచోట్ల ఈ ప్రోటోకాల్స్ ను అతిక్రమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయానికి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. అందువల్ల ప్రోటోకాల్ ను తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరుతున్నాము. ఈ సందేశంతోపాటు కొన్ని నమూనా డిజైన్ లను జోడిస్తున్నాము. ఈ విషయంలో మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా పార్టీ కేంద్ర కార్యాలయం లేదా అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ని సంప్రదించవలసిందిగా తెలియజేయడం జరిగింది.