రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండించిన మైలవరం జనసేన

మైలవరం, జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ… రైతుల పట్ల ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ, తక్షణమే వరి మరియు మొక్కజొన్న రైతులకు డబ్బులు రిలీజ్ చేయాలని, ఒక పంట కాలం పూర్తయ్యే రెండు, మూడు మాసాలు గడిస్తే గానీ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదని ఎందువలన డబ్బులు చెల్లించలేక పోతున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మన పక్క రాష్ట్రం తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే, మన రాష్ట్రంలో మాత్రం త్రీఫేజ్ కరెంట్ ఎప్పుడు వస్తుందో! ఎప్పుడు పోతుందో! తెలియని పరిస్థితి అని, రానున్నది వేసవికాలం అని కాబట్టి రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని, 24 గంటలు వ్యవసాయ నిమిత్తం కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు అతికొద్ది సమయంలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయకపోతే జనసేన మరియు బిజెపి పార్టీల ఆధ్వర్యంలో రైతులతో కలిసి, ప్రత్యక్ష పోరాటాలు చేయవలసి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు మాదాసు సుబ్బారావు, మల్లారపు దుర్గాప్రసాద్, పొన్నూరు విజయ్ కుమార్, కూసుమంచి కిరణ్ కుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.