ధర్మవరంలో రెవెన్యూ డివిజన్ ను కొనసాగించాలని జనసేన డిమాండ్

*ధర్మవరం గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి పై, రాష్ట్ర ముఖ్యమంత్రి పై గర్జించిన మధుసూదన్ రెడ్డి

గత 69 సంవత్సరాలుగా ఉన్న ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేస్తూ జీవో ఇచ్చిన వైసీపీకు నిరసనగా పాదయాత్ర చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు పిఏసి సభ్యులు మరియు ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి ఈ ప్రభుత్వం జీవోను రద్దు చేసేవరకు ఈ పోరాటం చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై విరుచుకుపడ్డ చిలకం మధుసూదన్ రెడ్డి. ఎక్కడి నుండో ఇక్కడికి వలస వచ్చి ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తూ పాలన సాగిస్తున్నారు ధర్మవరంలో ప్రతి రోజు ఉదయం 6 గంటలకు గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం అంటూ ధర్మవరంలో ఎక్కడ భూములు ఖాళీ స్థలాలు ఇల్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకె ఈ గుడ్ మార్నింగ్ ధర్మవరం ప్రోగ్రామ్ చేస్తున్నావని అన్నారు. అదే ప్రోగ్రామ్ మీద ఉన్న శ్రద్ధ ధర్మవరం రెవెన్యూ డివిజన్ పై నియోజకవర్గ అభివృద్ధిపై ప్రజల సమస్యలపై ఎందుకు లేదు అంటూ తనదైన శైలిలో ప్రశ్నలు సంధించారు

*ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు..

కొత్త జిల్లాలు చేయడం మేము వ్యతిరేకించడం లేదు. కానీ.. ఇలా ప్రాంతీయ విభేదాలు చోటు చేసుకునే విధంగా చెయ్యడం మేము వ్యతిరేకిస్తాం. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మూడు రాజధానులు చేసిన విధంగా ఈ జిల్లాలను కూడా చేస్తున్నారు. పాత రెవెన్యూ డివిజన్ లు ఎత్తివేస్తూ ప్రాంతీయ విబేధాలు రెచ్చగొడుతున్నారు. కనీసం ప్రజలకు మన రాజధాని ఎక్కడ ఉందో కూడా చెప్పలేక పోతున్నారు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు.

*ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ..

ధర్మవరం నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీని గెలిపిస్తే మన ధర్మవరంలో రౌడీలు. గుండాలు, దందాలు, భూకబ్జాలు చేసే వారిని అణిచివేస్తామని ప్రజలకు తెలియజేశారు. ధర్మవరాన్ని ప్రశాంత వరంగా మారుస్తా ఎప్పుడు మన ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.

ఈ పాదయాత్రకు మద్దతుగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు టి సీ వరుణ్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్ జిల్లా నాయకులు పెండ్యాల హరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు ధర్మవరం పట్టణ అధ్యక్షుడు అడ్డగిరి శ్యాం కుమార్,మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాస్, ప్రకాష్ రెడ్డి, రాజారెడ్డి, రాజ్ ప్రకాష్, వన్నేం శ్రీనివాసులు, కుళ్లాయప్ప, అది, నాగార్జున, అనంతపురము అర్బన్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.