మత్స్యకార అభ్యున్నతి సభ జయప్రదం చెయ్యాలని భీమిలి జనసేన పాదయాత్ర

భీమిలి, ఫిబ్రవరి 20వ తేదీన జరగబోయే పవన్ కళ్యాణ్ మత్స్యకార అభ్యున్నతి సభ జయప్రదం చెయ్యాలని భీమిలి నియోజకవర్గం మత్స్యకార గ్రామాల్లో ఫిబ్రవరి 17వ తేదీ నాడు భీమిలి జనసేన మత్స్యకార నాయకుల ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగనుంది.

పాదయాత్ర రూట్ మ్యాప్
ఉదయం 8 గంటలకు (మొదలు)
అవంతి కాలేజ్ నుండి ఆన్నవరం గ్రామం > నాగమయ్యపాలెం > మంగామారిపేట > కే. నగరపాలెం జంక్షన్ > కాపుల దిబ్బాడపాలెం > చేపల ఉప్పాడ గ్రామాలు > చిన్న ఉప్పాడ > పెద్ద ఉప్పాడ >
సాయంత్రం 4 గంటలకు
భీమునిపట్నంలో బోయ వీధి మరియు ఇతర మత్స్యకార వీధులు
సాయంత్రం 5 గంటల నుండి 6 గంటలకు భీమిలి బీచ్ వద్ద ముగియనుంది. ముఖ్యఅతిథిగా మత్స్యకార వికాస ప్రధాన కార్యదర్శి ముగి శ్రీనివాస్ విచ్చేస్తున్నారు. కావున భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు తప్పక ఈ పాదయాత్ర లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని జనసేన పార్టీ, భీమిలి నియోజకవర్గ ఇంచార్జి డా. సందీప్ పంచకర్ల అన్నారు.