మంచినీటి పథకాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్ చేసిన జనసేన

పోలవరం నియోజకవర్గం పోలవరంలో మహానుభావుడు సత్యసాయి ట్రస్ట్‌ నుండి ప్రజల దాహం తీర్చేదందుకు గోదావరి నదినుండి శుద్ది చేసిన త్రాగునీరు నాలుగు నియోజకవర్గాల ప్రజలకు..17 మండలాలకు దాదాపు 7 నుండి 8 లక్షల ప్రజలకు నిత్యం త్రాగునీరు అందిస్థున్న సత్యసాయి మంచినీటి పథకం పంప్‌హౌస్‌ నుండి సంవత్సరం నుండి నీరు అందక ప్రజలు కలుషిత నీళ్ళు తాగి వ్యాదుల పాలవడం.. బోరు నీళ్ళు తాగలేక ప్లాంట్‌ వాటర్‌ కొనలేక పేదలు చాలా నరకం చూడడం జరుగుతుంది. నీళ్ళు రాకపోవడానికి ప్రధాన కారణం సంస్థలో పనిచేయు కార్మికులకు సంవత్సరంపై నుండీ జీతాలు లేకపోవడంతో 2006 ప్రారంభమైన ఉచిత స్వచ్చమైన గోదావరి నీరు అందే సత్యసాయి మంచినీటి పథకం 16 సంవత్సరాలనుండీ సంస్థలో పనిచేస్తూ.. సంవత్సరం పైనుండీ జీతాలు లేక అలో లక్ష్మణా అంటున్న కార్మికులకు త్రాగునీరు లేక ప్రజలకు సంఘీభావంగా మేమున్నాం అంటూ గతంలో జనసేనపార్టీ జిల్లా అద్యక్షులు కొటికలపూడి గోవిందరావు, కరాటం సాయి, చిర్రి బాలరాజు, గడ్డమణుగు రవికుమార్‌ మరియు జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, పోలవరం నియోజకవర్గ నాయకులు, జనసైనికులు భారీగా పంప్‌హౌస్‌ వద్దకు చేరి కార్మికులకు మద్దతు ప్రకటించడం జరిగింది. జిల్లా అధ్యక్షులు.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ దృష్టికి తీసుకెళ్ళి ప్రజల, కార్మికుల సమస్య పరిష్కారం చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వచ్చేది వేసవికాలం నీటికోసం ప్రజలు ఇక్కట్లు మరింత పెరిగే అవకాసం ఉంది. ఈ జగన్‌ ప్రభుత్వానికి నిర్మాణం ఎలాగూ చేతకాదు కనీసం నిర్మించి ఉన్న ప్రజలకి ఖచ్చితంగా అవసరమైన మంచినీటిని పధకాలను ఆపడం దారుణం. తక్షణం పునఃప్రారంభం చేయాలని జనసేపార్టీ పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్‌ చిర్రి బాలరాజు జగన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.