జనసైనుకుల్లారా పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోండి: పాలవలస యశస్వి

విజయనగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు మొదలయ్యాయని, దాన్ని జనసైనుకులంతా వినియోగించుకోవాలని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ పాలవలస యశస్వి సోమవారం విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏరాజకీయ పార్టీకి కార్యకర్తలకు భీమా సదుపాయం కల్పించలేదని, కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరే కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించి ఈ భీమా సదుపాయాన్ని కల్పించారని ఆమె అన్నారు. క్రియాశీలక సభ్యత్వాలు చేయించు కోవాలనుకొనేవారు, ఫోటో, ఫోన్ నెంబర్, వారి ఆధార్ కార్డ్, ఓ ఐదువందల రూపాయలు సమకూరిస్తే ప్రతీఒక్కరి యువతీయువకులకు జనసేనపార్టీ తరుపున జీవిత భీమా మరియు ఆరోగ్య భీమా వర్తిస్తుందని, పొరపాటున ప్రమాదవశాత్తు చనిపోయిన కార్యకర్త కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు, ఏదైనా ఎక్సిడెంట్ జరిగితే ప్రమాద తీవ్రతను బట్టి పదివేలు రూపాయలు నుండి ఏబై వేలు వరకు ఆరోగ్య భీమా ఉంటుందని తెలిపారు. క్రియాశీలక సభ్యత్వాలు చేయించు కోవాలనుకునేవారు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలను గాని సంప్రదించవచ్చని, లేదా నేరుగా జనసేన పార్టీ కార్యాలయంలో సంప్రదించవచ్చని ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతీ ఒక్క జనసైనుకుడు, వీరమహిళలు వినియోగించుకోవాలని అన్నారు.