వీరఘట్టం జనసేన ఆధ్వర్యంలో మాతృ భాషా దినోత్సవ వేడుకలు

శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా వీరఘట్టం మండలం నడుకూరు ఎంపియూపి పాఠశాలలో ఉన్న సరస్వతి దేవి విగ్రహం, తెలుగుతల్లి చిత్ర పటానికి ప్రత్యేక పూజలు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మన నది – మన నుడి లో భాగంగా అంతరించిపోతున్నాయని వాటిని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, మాతృభాషతోనే విజ్ఞానాభివృద్ధి జరుగుతుంది. మన సంస్కృతి, ఆచారం, కుటుంబ పద్ధతులు అన్ని మాతృభాషలోనే అర్ధం చేసుకోగలం. పరాయి భాష మోజులో పడి మాతృభాషను చిన్నచూపు చూడకూడదు. మన మాతృభాషను ప్రతిఒక్కరు రక్షించుకోవాలని జనసేన పార్టీ మండల నాయకులు మత్స్య పుండరీకం అన్నారు.

అంతకుముందు విద్యార్థులకు
1.మన నుడి – మనబడి
2.మన మాతృభాష – తెలుగు భాష అంశాలపై 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డిబేట్ పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు మరియు పోటీలో పాల్గొన్న విద్యార్థులకు కూడా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కంటు మురళి, సాధు విశ్వేశ్వరరావు, కర్ణేన. పవన్ సాయి వావిలపల్లి నాగభూషణం, దత్తి గోపాలకృష్ణ, వావిలపల్లి విస్సు, వాన కైలాష్, వాన మహేష్, కలిపిల్లి సింహాచలం, రౌతు గోవింద, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.