నేడు గవర్నర్ తో భేటీ కానున్న సోము వీర్రాజు

అంతర్వేది ఘటన అంశంపై జగన్ సర్కారుతో అమీ తుమీ తేల్చుకునేందుకు బీజేపీ సిద్ధమైంది. జగన్ ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఈ రోజు  ఉదయం 11.30 నిమిషాలకు గవర్నర్‌ను ఆయన కలవనున్నారు. అంతర్వేది రథం దగ్ధం, ఇతర ఆలయాలలో జరిగిన ఘటనలను గవర్నర్‌కు వివరించనున్నారు. చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేసిన వారిపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేశారని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లనున్నారు. బీజేపీ నేతలపై జరిగిన దాడుల పట్ల ప్రభుత్వం స్పందించడం లేదంటూ సోము వీర్రాజు ఆధారాలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నారు.