జనసేన క్రియాశీలక సభ్యత్వం – భద్రమైన భవితవ్యం: శ్రీకాంత్ వబ్బిన

పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జనార్థన శ్రీకాంత్ వబ్బిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కోసం మాట్లాడుతూ ఫిబ్రవరి 21న అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతులమీదుగా 2022-23 క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించడం జరిగిందని, గత సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ లో సుమారు లక్ష పై చిలుకు క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారని, గత సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం తీసుకొని అకస్మాత్తుగా మరణించిన 18 మందికి 5 లక్షల రూపాయలు చెక్కు వారి కుటుంబానికి ఇవ్వడం జరిగిందని, అదేవిధంగా అకస్మాత్తుగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి వైద్యం నిమిత్తం 50 వేలు రూపాయలు ఇవ్వడం జరిగిందని, ప్రతి నియోజకవర్గంలో సుమారు 20 నుంచి 40 మందికి ఈ క్రియాశీలక సభ్యత్వం ఎన్రోల్మెంట్ చేయడానికి ట్రైనింగ్ ఇచ్చారని, ట్రైనింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరూ మీ యొక్క గ్రామ, వార్డు, నియోజకవర్గ, పరిధిలో జనసేన కుటుంబ సభ్యుల్ని గుర్తించి క్రియాశీలక సభ్యత్వం కోసం వివరించి వారందరికీ సభ్యత్వాలు చేయాలని, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క ప్రాంత పరిధిలో ఉన్న జనసేన పార్టీ నాయకులును సంప్రదించి క్రియాశీలక సభ్యత్వం కోసం తెలుసుకొని బాధ్యతగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో 2 వేలకు తగ్గకుండా క్రియాశీలక సభ్యత్వలు చేయాలని, పార్టీ అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కోరడం జరిగింది.