భీమ్లా నాయక్ సినిమాపై కక్ష సాధింపు సరికాదు: కొండిశెట్టి ప్రవీణ్ కుమార్

భీమ్లా నాయక్ చిత్రం పై ఆంక్షలు విధించడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని జనసేనపార్టీ శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా కొండిశెట్టి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జనసేనాని పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక ఆర్థికంగా దెబ్బ తీయాలనే ఉద్దేశంతో భీమ్లా నాయక్ సినిమాపై ఆంక్షలు పెట్టడం వైసీపీ ప్రభుత్వం మూర్ఖపు రాజకీయాలకు అద్దం పడుతుందని, తెలుగు చిత్ర పరిశ్రమ అంటే ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు. చిత్ర పరిశ్రమ పై ఎందరో కళాకారులు, అనేకమంది కార్మికులు, వారి కుటుంబాలు ఆధారపడి ఉంటాయని అన్నారు. ఒక వ్యక్తి కోసం వ్యవస్థను నిర్వీర్యం చేయాలనుకోవడం అవగాహనారాహిత్యం అవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలతో ఆదరిస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించటం దుర్మార్గం. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం తీరు మార్చుకుని రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి సారించాలని.. లేకుంటే రాబోయే రోజుల్లో పవన్ అభిమానులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ మోహన్ రెడ్డి కి తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.