అర చేతితో సూర్యున్ని ఆపలేరు
*భీమ్లా నాయక్ విజయాన్ని అడ్డుకునే ప్రయత్నం కుటిలతత్వం అన్న మెట్ల
అమలాపురం, పాలనపై దృష్టి పెట్టకుండా పవన్ కళ్యాణ్ సినిమాపై ఫోకస్ పెట్టడం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యకు నిలువుటద్దం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు అన్నారు. ఎంత అడ్డుకున్నా భీమ్లా నాయక్ విజయాన్ని అడ్డుకోలేక పోయారని, ఇది ప్రభుత్వ శాడిజానికి నిదర్శనం అన్నారు. వ్యక్తులపై కక్షతో సమాజానికి చేటు తేవడం మంచి పద్దతి కాదని రమణబాబు హితవు పలికారు. ప్రజలకు వినోదం పంచే సినిమాల పట్ల వివక్షత చూపకూడదని, పవన్ అభిమానులతో పాటు పలు వర్గాలు సినిమాను విజయవంతం కావాలని కోరుకున్నారని మెట్ల అన్నారు. ఇప్పటికయినా ఇటువంటి చర్యలు వదులుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-25-at-8.18.32-PM-1024x1024.jpeg)