నాగ రామ పద్మావతి క్షేమ సమాచారం తెలుసుకున్న బండారు శ్రీనివాస్!

*ఉక్రెయిన్ దేశంలో మెడిసిన్ కోర్సు చదువుతున్న వైద్య విద్యార్థిని డాక్టర్ మెండు నాగ రామ పద్మావతి క్షేమ సమాచారం తెలుసుకున్న జనసేన ఇన్ ఛార్జ్ బండారు శ్రీనివాస్

తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ బండారు శ్రీనివాస్ శనివారం ఆలమూరు మండలం, సందిపూడి గ్రామంలో పర్యటించారు. సందిపూడి గ్రామంలో నుంచి ఉక్రెయిన్ దేశంలో వైద్య విద్యా కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థిని డాక్టర్ పద్మావతి యోగక్షేమాలను కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. ఉక్రెయిన్ దేశం లో గత వారం రోజుల నుంచి అక్కడ పరిస్థితులు అనుకూలించక, యుద్ధవాతావరణం భీకరంగా జరుగుతున్న వాతావరణంలో, భయానక పరిస్థితుల నెలకొన్న దృష్ట్యా, ఉక్రెయిన్ దేశంలో విద్యాభ్యాసం చేస్తున్న మన తెలుగు బిడ్డలు ఎలా ఉన్నారో అని, విద్యార్థుల తల్లిదండ్రులే కాకుండా.. పలువురు బంధువులు, గ్రామాలలో ఉన్న నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండటం శ్రేయస్కరం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో ఉక్రెయిన్ దేశంలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులను ఆగమేఘాల మీద తమ తమ స్వగ్రామాలకు తీసుకు వచ్చిన కారణంగా.. శనివారం కొత్తపేట నియోజకవర్గం జనసేన నేత బండారు శ్రీనివాస్ వైద్య విద్యార్థిని పద్మావతిని, వారి తల్లిదండ్రులను కలిసి, ఆమెను సత్కరించి దీవెనలు అందజేశారు. జనసేన నేత బండారు శ్రీనివాస్ తో పాటు, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజ్, సందిపూడి సర్పంచ్ తోట భవాని, ఆలమూరు జనసేన పార్టీ అధ్యక్షులు సూరపు రెడ్డి సత్య పలువురు జన సైనికులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్య విద్యార్థి పద్మావతి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారికి ధన్యవాదాలు తెలియ జేశారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-05-at-8.12.20-PM-768x1024.jpeg