ఘనంగా ఎంగిలిపూవు బతుకమ్మ వేడుకలు

తెలంగాణాలో బతుకమ్మ సందడి ఘనంగా మొదలైంది. గురువారం తీరొక్క పూలతో ఎంగిలి బతుకమ్మను పేర్చి చిన్నాపెద్దా మహిళలు ఆడిపాడారు. బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎంగిలి పూవ్వు పండుగను తెలంగాణలో సంబురంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా వేములవాడ పట్టణంలో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను గురువారం వైభవంగా జరుపుకున్నారు. మహిళలు పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను అలంకరించారు. కరోనా ను  సైతం లెక్క చేయకుండా సాయంత్రం ఆయా కూడళ్లలో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ కోలాహలంగా పండుగను జరుపుకున్నారు. గుడి చెరువు, బతుకమ్మ తెప్ప వద్ద బతుకమ్మలను నిమజ్జనం చేశారు. రాష్ట్రంలో జరిగే వేడుకలకు భిన్నంగా వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ నిర్వహించనున్నారు.

ఈ ఏడాది అధికమాసం రావడంతో ఇపుడు ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించి వచ్చే నెల 17 నుండి మళ్లీ యథావిధిగా బతుకమ్మ వేడుకలు జరుపుకోనున్నారు. అయితే, మహిళలు అటు పుట్టినింట్లో ఇటు మెట్టినింట్లో రెండు చోట్ల వేడుకలు జరుపుకునే అవకాశం కలిగింది. రాష్ట్రమంతా అక్టోబర్ 22 తేదిన సద్దుల బతుకమ్మ వేడుకలు జరపనున్నారు.