‘తెరవెనుక’ ఫస్ట్‌లుక్
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘తెరవెనుక’. ప్రవీణ్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ విడుదలచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘ప్రవీణ్చంద్రతో ఇరవై ఐదేళ్లుగా పరిచయముంది. దర్శకుడిగా అతడికి ఈ సినిమా మంచి పేరుతెచ్చిపెట్టాలి. వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం విజయవంతమవ్వాలి’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుంది. త్వరలో టీజర్‌ను విడుదల చేయబోతున్నాం’ అని, మంచి కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని ఎన్.శంకర్‌గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు.