ఉచితంగా నీటి కనెక్షన్ ఏర్పాటు చేసిన జనసేన వీరమహిళ

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని 28 వ వార్డ్ ప్రజలు ఎండాకాలం రాకముందే నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని ఉచితంగా నీటి కనెక్షన్ ఏర్పాటు చేసిన జనసేన వీరమహిళ సరస్వతి. ఈ సందర్భంగా సరస్వతి మాట్లాడుతూ మేము ఈ రోజున సామాన్య ప్రజలకు ఏదైనా చేస్తున్నాం అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చూపిన సేవా మార్గమే జనసేన పార్టీ ప్రజలకు ఏ సమస్య వచ్చిన ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటుంది అని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాజ్ ప్రకాష్, వన్నూ శ్రీరాములు, కుమార స్వామి, కార్పెంటర్ రాజు, మీసాలు ఆది తదితరులు పాల్గొన్నారు.