జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు విజయవంతం చేయాలని గంధం ఆనంద్ పిలుపు

జనసేనపార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు అనగా 20.03.2022 నుండి 27.03.2022 వరకు పొడిగించడమయినది. ఈ విషయాన్ని గమనించి ఇంకా నమోదు చేసుకోనివారు నమోదు చేసుకోవలన ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ చెప్పారు. అలానే నియోజకవర్గాలలో ఉన్న జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులకు కూడా తెలియజేయవలసినదిగా కోరుతున్నాం. ఈ సందర్భంగా దాదాపు లక్షమంది పైచిలుకు సభ్యత్వాలు తీసుకున్నారు. అంతేకాకుండా జనసేన పార్టీని క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి మేము రెడీగా ఉన్నామఅని ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యార్థి విభాగ కార్యనిర్వహక సభ్యుడు గంధం ఆనంద్ మాట్లాడుతూ అంతేకాకుండా యువత ప్రమాదవ్ శాత్తూ చాలా మంది చనిపోతున్నారని పవన్ కళ్యాణ్ మన కోసం క్రియాశీలక సభ్యత్వం తీసకున్నవారికి రూ.5లక్షల ప్రమాద భీమా కల్పిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం చెప్పటినట్టు వెల్లడించారు. క్రియాశీలక సభ్యత్వం విషయంలో దివంగత కాన్షిరామ్, దళిత ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకున్నట్లు అన్నారు. జనసేనపార్టీ క్రియాశీలక సభ్యత్వం కోసం ఇకపై రూ:500 చెలించాల్సి ఉంటుంది. సభ్యత్వం తీసుకున్నవారికి రాబోయే రోజుల్లో శిక్షణ ఇవ్వడం కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించి జనసైనికుల్లో బరోసా నింపుతామని తెలియజేశారు. క్రియాశీలక సభ్యత్వం నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరూ జనసైనికులు, కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నానని గంధం ఆనంద్ అన్నారు.