జనసేన ఆధ్వర్యంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా రక్తాదాన శిబిరం

గుంటూరు, ప్రముఖ సినినటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాలను పురష్కారించుకొని సోమవారం గుంటూరు జిల్లా కోల్లిపర మండలం చక్రాయపాలెం గ్రామంలో గుంటూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, స్థానిక ఎం.పి.టి.సి సభ్యులు అయిన ఆమ్మిశెట్టి హరిక్రిష్ణ మరియు గ్రామ జనసైనికుల సహకారంతో రక్తాదాన శిబిరం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టి రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండారు రవికాంత్, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, గుంటూరు జిల్లా కార్యదర్శి గుంటూరు క్రిష్ణ మెహన్ కొల్లిపర, తెనాలి మండలాల జనసేన పార్టి అధ్యక్షులు మధు, వెంకయ్యనాయుడు, శ్రీయుతులు చవాకులు కోటేశ్వరరావు, సీనియర్ నాయకులు గాదె లక్ష్మణరావు, షేక్ కాలేషావలి, శివమణి, కారుమంచి కోటేశ్వరరావు, వినయ్, తదితర జనసైనికులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కండేయ బాబు మాట్లాడుతూ… రామ్ చరణ్ తండ్రి బాటలో పయనిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ఆయన అభిమానుల చేత కూడా సేవా కార్యక్రమాలు చేయించటం చాలా హర్షించదగ్గ విషయం అన్నారు. రవికాంత్ మాట్లాడుతూ ఈ గ్రామంలో ఇంత మంచి రక్తాధాన శిబిరం ఏర్పాటు చేసిన స్థానిక ఎం.పి.టి.సి సభ్యులు ఆమ్మిశెట్టి హరిక్రిష్ణను మరియు గ్రామ జనసైనికులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు హారిక్రిష్ఠ మాట్లాడుతూ నేను చేసే ప్రతి కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు అందరూ పూర్తి స్థాయిలో తమ సహకారాన్ని అందించడం నేను పూర్వ జన్మలో చేసుకున్న సుకృతమని అన్నారు. అనంతరము రాష్ట్ర నాయకులైన మార్కండేయ బాబు, రవికాంత్ ని ఘనంగా సన్మానించటం జరిగింది.