చాలారోజుల తర్వాత.. ఇలియానా

తన అందచందాలతో తెలుగు ఇండస్ట్రీలో అగ్ర కథానాయకగా  కొన్నాళ్ళ పాటూ తన హవా కొనసాగించిన  గోవా బ్యూటీ ఇలియానా. ఓ పక్క ఇటు తెలుగులో నటిస్తూనే.. మరోవైపు హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అక్కడ బాలీవుడ్‌లోను ఇక్కడ టాలీవుడ్‌లోను అవకాశాలు రాకపోవడంతో.. కొన్నాళ్లు ఖాళీగా ఉన్న ఈ భామ ఆ మధ్య రవితేజ హీరోగా తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈ సినిమా సరిగా అలరించకపోవడంతో ప్రస్తుతం ఇలియానాకు ఛాన్సులే కరువయ్యాయి. ఇన్ని రోజుల తర్వాత ఇలియానా ఓ తెలుగు సినిమా సైన్‌ చేశారని సమాచారం. నాగార్జున హీరోగా వస్తోన్న ఓ సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా నటించనుందని తెలుస్తోంది. ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలోనే ఇలియానా హీరోయిన్‌గా చేయనుందట. ఈ చిత్రానికి ‘నా కథానాయకగా  యాక్షన్ స్క్రిప్ట్‌ గా రాసుకున్నాడని.. ఓ రైతు తప్పిపోయిన తన కూతురు కోసం వెతికే క్రమంలో అతను చేసే రిస్క్ కి సంబంధించిన సీన్స్ చాలా ఇంట్రస్ట్ గా ఉంటాయని సమాచారం.