పుట్టపర్తిలో క్రికెట్ టోర్నమెంట్ మెగా ఫైనల్ కు ముఖ్య అతిధిగా చిలకం మధుసూదన్ రెడ్డి

పుట్టపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ 6 మండలాల అధ్యక్షుల ఆధ్వర్యంలో పుట్టపర్తిలో బుధవారం క్రికెట్ టోర్నమెంట్ మెగా ఫైనల్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకం మధుసూదన్ రెడ్డి విచ్చేసి మెగా ఫైనల్ విన్నర్స్ మొదటి విజేత సూరి 11కు టింకు మొదటి ప్రైస్ బహుమతిగా రూ.50,001/- ద్వితీయ బహుమతిగా సాయి సేవ టీంకు రూ.25,001/- మూడవ బహుమతిగా ధూపం పల్లి టీంకు రూ.10,001/- అలాగే విజేతలకు కప్స్ అందజేసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు పత్తి చంద్రశేఖర్, గొట్లూరు దాసరి రామాంజనేయులు, మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, బత్తలపల్లి మండల కన్వీనర్ పుర్రం శెట్టి రవి, పట్టణ నాయకులు అడ్డగిరీ శ్యామ్ కుమార్, కోటికి రామంజి, పేరురూ శ్రీనివాసులు మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.