రామచంద్రపురం మున్సిపల్ కమీషనర్ కి వినతిపత్రమిచ్చిన పోలిశెట్టి

రామచంద్రపురం పట్టణము 20వ వార్డు హౌసింగ్ బోర్డు ఎల్.ఐ.జి కాలనీలోని ప్రజలంతా రోడ్డు సమస్య వల్ల స్కూల్ కి వెళ్ళే చిన్న పిల్లలు, పెద్దవాళ్లు, మహిళలు, వృద్ధులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోడ్డు గత కొన్ని సంవత్సరముల ముందు నుండి వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా మునిగిపోయి డ్రైనేజీ నీళ్లు ఇళ్ళలోకి వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ కలుషితమైన నీరు రోడ్లపై నిలవ ఉండడం వలన చిన్న పిల్లలు తరచుగా వీధులలో తిరుగుతూ ఉండడం వల్ల డెంగ్యూ మలేరియా వ్యాధుల భారినపడుతున్నారు. ఈ రోడ్డు యెుక్క పరిస్థితి గత 10 సంవత్సరాల నుండి పట్టించుకోనిపరిస్థితి. అక్కడున్న ప్రజలు అధికారులకు ఎన్ని సార్లు తెలియజేసిన వారు ఈ రోడ్డును వేయడం లేదని తెలియజేయడం జరిగింది… తక్షణమే ఈ వీధిలో పల్లంగా ఉన్న ఈ రోడ్డును ఎత్తుగా చేసి నీరు రోడ్ల పై నిల్వ ఉండకుండా ప్రజల యెుక్క అభ్యర్ధన మేరకు తక్షణమే రోడ్డు వేయవలసిందిగా మున్సిపల్ కమీషనర్ ని కోరుచున్నాను. అంతేకాకుండా ఈ ఎల్.ఐ.జి కాలనీలో పందులు స్వైర విహారం చేస్తూ చుట్టుప్రక్కల ఉన్న చిన్న పిల్లలు భయభ్రాంతులకు గురవుతున్నారు.వాటిపై తక్షణ చర్యలు తీసుకొని వాటిని వేరే ప్రదేశానికి తరలించాలని మున్సిపల్ కమిషనర్ ని కోరుతూ వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు బుంగరాజు సంపత్ సత్యనారాయణ మూర్తి రామచంద్రపురం పట్టణం మూడో వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, నంబులనాగు, వడ్డీ సత్తి బాబు, రాంబాబు నాయుడు, కొలగాని సతీష్, పోలిశెట్టి మణికంఠ స్వామి తదితర హౌసింగ్ బోర్డ్ కాలనీ ఎంప్లాయిస్ పాల్గొనడం జరిగింది.