భాకరపేట ఘాట్ రోడ్డు ప్రమాదానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం: దేవర మనోహర

చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట ఘాట్లో అనంతపురం జిల్లా ధర్మవరం పెళ్లి బృందం బస్సు ప్రమాద ఘటనలో ఎనిమిది మంది మృతికి మరియు 44 మంది క్షత్రగాత్రులకు ప్రభుత్వం నిర్లక్ష్యమే ప్రధాన కారణమని జనసేన నాయకులు మీడియా ముఖంగా ఆరోపించారు. తరచూ భాకరాపేట ఘాట్ లో ప్రమాదాలు జరుగుతున్నా సరే ఎటువంటి రోడ్డు రెయిలింగ్ లేకపోవడం మరియు ప్రమాదకరంగా ఉన్నటువంటి మలుపు వద్ద స్పీడ్ బ్రేకర్ ఉంది అని గుర్తించే విధంగా ఎటువంటి సూచనలు చేసే గుర్తులు లేకపోవడం మరియు టర్నింగ్ లో ఎటువంటి స్పీడ్ లిమిట్ సూచనలు ఉన్న బోర్డు గాని లేకపోవడం, రోడ్డు వెడల్పు చేయకుండా రోడ్డు పక్కన ఉన్నటువంటి ముళ్ళ కంపలను మరియు భారీ గేట్స్ తీసివేయడం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆరోపించారు, సరాసరి రోజుకు 2 ప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వం పెడచెవిన పెట్టడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు. ప్రమాద బాధితులకి తక్షణమే ప్రభుత్వం స్పందించి మృతుల కుటుంబాలకు ఒక్కొకరికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని మరియు క్షతగాత్రులకు లక్ష రూపాయలు సహాయంగా అందించాలని అలాగే వారి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక మునుపు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం మరియు ప్రజా ప్రతినిధులు తక్షణమే భాకరాపేట ఘాట్ లో ఉన్నటువంటి మూడు ఘాట్ రోడ్డు మరియు ప్రమాదకర మలుపు దగ్గర రోడ్ రోలింగ్ వేయాలని మరియు ప్రమాద సంకేతాలు తెలియజేసే విధంగా రేడియం స్టికర్స్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు అయినా ఎస్ పి వెంగళప్ప నాయుడు, డీఎస్పీ నర్సప్ప, అలాగే చంద్రగిరి సీఐ శ్రీనివాసులు మరియు మిగిలిన ప్రభుత్వ అధికారులకు, మరియు స్వచ్ఛందంగా సహాయ సహకారాలు అందించిన ప్రజలకి జనసేన పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపడం జరిగింది.