పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ శ్రీకాకుళం జనసేన నిరసన

శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శుక్రవారం శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి, పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన జనసేన నాయకులు కాంతి శ్రీ సయ్యద్, పేడాడ రామ్మోహన్, డాక్టర్ విశ్వక్ సేన్, దాసరి రాజు, కణితి కిరణ్, గర్భాన సత్తిబాబు మరియు పలువురు నాయకులతో కలిసి కలెక్టర్ కు వినతి పత్రాలు అందచేసిన రాజాం నియోజకవర్గం జనసేన నాయకులు ఎన్ని రాజు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి పాదయాత్ర సమయంలో అప్పటి ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచారని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఇష్టానుసారంగా పెంచి, పేదలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. గడిచిన కాలంలో ఈ రెండు వైసిపి, టిడిపి పార్టీల పరిపాలనలో విసుగు చెందిన ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే న్యాయం చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లాకు చెందిన జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.