పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలంటూ నెల్లూరు కలెక్టరేట్ వద్ద నిరసన

నెల్లూరు, కష్టకాలంలో ప్రజలను ఇబ్బంది పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గం అంటూ జనసేన పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
👉ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్షా కరెంట్ బిల్లు ముట్టుకొంటే షాక్ తగులుతుంది 500 రూపాయల బిల్లు వస్తే పేదవారు ఎలా కట్టగలరు అన్న జగన్ రెడ్డి ఈరోజు సగటు పేద,మధ్యతరగతి వారి విద్యుత్ చార్జీలను 30% వరకు పెంచారు..అంటే రూ1000 ఉన్న బిల్లు ఇపుడు రూ1300 వస్తుందన్న మాట.
👉పాదయాత్ర లో ఉన్నప్పుడు పేదలకు 200 యూనిట్లు ఫ్రీ గా ఇస్తాము దానితో మూడు డైట్ లో రెండు ఫ్యాన్లు 16 గంటలపాటు టివి ఉచితంగా తీసుకోవచ్చు తీసుకోవచ్చు అన్న జగనన్న హమీ ఏమైంది..
👉ఎన్నికల ముందు రైతులకు ఎనిమిది గంటలపాటు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తానని చెప్పి గ్రామాల్లో మూడు గంటల నుంచి 6 గంటల వరకు కరెంటు కోతలు విధించడం ఎంతవరకు సమంజసం
👉 గిరాగిరా తిరుగుతుంది అని ఓట్లేసిన జనాలు ఫ్యాన్ వేస్తే షాక్ తగిలే పరిస్థితి
👉 ఉగాది కానుకగా పేద మరియు మధ్యతరగతి జనాలకు భారీ షాక్ ఇచ్చారు జగన్ గారు
👉కరోణా కష్ట కాలంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ప్రజలకు ఉగాది కానుకగా 1400 కోట్ల విద్యుత్ భారం ట్రూ అప్ కింద 3 వేల కోట్ల రూపాయల భారం వేయటం దారుణం
👉ధనార్జనే ధ్యేయంగా వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం అనిపిస్తుంది
👉ఉదయాన్నే లేస్తే పన్ను విధిస్తారు ఏ విధంగా ప్రజల నుంచి డబ్బులు లాగేసుకుంటూ అని ప్రజలు భయపడుతున్నారు
👉 తెల్లవారుజామున నిద్ర లేవాలంటే భయంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన ఇబ్బంది పెట్టి డబ్బులు గుంజుతుందో అని బెంబేలెత్తుతున్నారు..
👉 పెంచిన విద్యుత్ చార్జీలు ఏ విధంగా ఏ విధంగా ఒప్పుకునేది లేదు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు జనసేన పార్టీ తరఫున విద్యుత్ ఛార్జీలపై నిరసనగా చేపడతామని తెలిపారు
👉ఇన్ని రకాలుగా ప్రజల నుంచి డబ్బులు గుంజుతున్న ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ఏమాత్రం ఉపయోగపడటంలేదు
👉రానున్న ఎన్నికలలో సరైన సమాధానం చెబుతారు అని తెలియజేశారు
👉పేద మరియు మధ్యతరగతి ప్రజల సంక్షేమాన్ని ప్రజాశ్రేయస్సు జనసేన పార్టీ తో మాత్రమే సాధించగలమని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా అధికార ప్రతినిదులు దుగ్గిశెట్టి సుజయ్, కలువాయి సుధీర్, రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, కోలా విజయలక్మి, జిల్లా నాయకులు వెంకట సుబ్బయ్య, గూడూరు వెంకటేశ్వర్లు, సుకన్య, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.