షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలు అమలు కావాలి

పాడేరు డివిజన్, జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన నూతన జిల్లాల ప్రక్రియ విషయమై సమావేశంలో పాడేరు, అరకు, నియోజకవర్గ పరిధిలో గల ముఖ్యనాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జి డా. వంపురు గంగులయ్య మాట్లాడుతూ.. ప్రస్తుతానికైతే నూతన జిల్లాల విభజన చేశారు. కానీ శాస్త్రీయత లోపించిన మాట వాస్తవం. అయితే ఈ ఆదివాసీ ప్రాంతాలని అల్లూరి సీతారామరాజు జిల్లాగా ప్రకటించడం గిరిజనులు అందరూ.. ఆనందించదగ్గ విషయం. ఒకవైపు నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా కనుక ఇక్కడ ప్రభుత్వ, ప్రయివేట్ రంగాలకు చెందిన ఎటువంటి పరిశ్రమలు లేవు.. అందుకు ప్రభుత్వమే అల్లూరి జిల్లా నిరుద్యోగ యువతకు, విశాఖపట్నం జిల్లాలో పలు ప్రభుత్వ పరిశ్రమల్లో ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని సూచించారు. అలాగే అపరిష్కృతంగా ఉన్నా మౌళిక సధుపాయలు కల్పిస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థలు స్థిరమైన భవనాలు నిర్మాణం వేగవంతం చెయ్యాలి. మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి అవన్నీ పూర్తిచేస్తామని ప్రజలకు అయోమయానికి గురిచేసి మభ్యపెట్టి మోసం చేయదలిస్తే.. 2024 లో ప్రజలు కోలుకోలేని దెబ్బకొడతారని హెచ్చరించారు. 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలు పీషా, మరియు 1/70చట్టాలు ఉల్లంఘన కాకుండా పటిష్ట అమలుకు కార్యోన్ముఖులు కావాలని తెలిపారు. ఈ సమావేశం అనంతరం అల్లూరి జిల్లా జనసేన ప్రధాన కార్యాలయం నుంచి జనసైనికులు, పలు మండలాల ముఖ్యనాయకులు జనసైనికులతో కలిసి బైక్ ర్యాలీ చేస్తూ.. నినాదాలతో కలెక్టరేట్ కు వెళ్లి వినతిపత్రం అందించారు. ఈ సమావేశం మరియు ర్యాలీలో ముఖ్యంగా జనసేన ఇన్చార్జి తో పాటు అరకు నియోజకవర్గ అధికారప్రతినిది మాదాల శ్రీ రాము, బంగారు రాందాస్, పాడేరు మండలం నుంచి అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, కొర్ర కమలహాసన్, పార్లమెంట్ ఎగ్స్క్యూటివ్ మెంబర్, వినయ్, ఆనంద్ పాంగి వెంకటేష్,సురేష్, ప్రసాద్, మురళి కృష్ణ మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అశోక్ సాలేబు సత్యనారాయణ, కక్కి జనసైనికులు, ఈశ్వరరావు, బాబూరావు, జి. మాడుగుల మండల నాయకులు మసాడి భీమన్న, ఉపాధ్యక్షులు ఈశ్వరరావు, కార్యదర్శి గొంది మురళి,గౌరవ అధ్యక్షులు తెరవడా వెంకటరమణ,యూత్ అధ్యక్షులు,మస్తాన్,పవన్,రమేష్,మసాడి సింహాచలం గంగప్రసాద్, చింతపల్లి మండల నాయకులు బుజ్జి బాబు, నాని, అశేష సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.