జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పెదగంట్యాడ జనసేన ఘన నివాళి

గాజువాక, డాక్టర్ బాబు జగజ్జివన్ రావు పుట్టినరోజు సందర్భంగా ప్రేమ నిధి ఫౌండేషన్ చైర్మన్ అంజురీ దీపక్ ఆధ్వర్యంలో పెదగంట్యాడలో జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కెఎన్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కరణంరెడ్డి నరసింహారావు, మరియు గాజువాక మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, విశాఖపట్నం జిల్లా జనసేన నాయకులు కోన చిన అప్పారావు హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జివన్ రావు అణగారిన వర్గాలకి కుల వివక్షతకి వ్యతిరేకంగా పోరాటం చేసి ఉన్నారు. రాజ్యాంగంలో ఈ ఒక్క వర్గాలకి మంచి జరగాలని ఆకాంక్షించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎఫ్ బి సి డైరెక్టర్ సిరసపల్లి నూకరాజు బిజెపి వార్డు అధ్యక్షులు కిల్లాడి ముసలయ్య, బిజెపి నాయకులు ములకలపల్లి ఈశ్వరరావు, జనసేన నాయకులు కోన చంటి, ఏఐటీయూసీ నాయకులు ఉరుకుటి రమణయ్య, లక్ష్మీ, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.