చిరంజీవి యువత ఆధ్వర్యంలో “అల్లు అర్జున్ పుట్టినరోజు” మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా “గని” విడుదల వేడుకలు

విజయనగరం, ప్రముఖ యువ నటులు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ప్రతిష్టత్మాకంగా నిర్మించిన గని సినిమా విడుదల సందర్బంగా శుక్రవారం ఉదయం లీలామహల్ థియేటర్ లో ఘనంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. ముందుగా లీలామహల్ థియేటర్ మేనేజర్ సత్యనారాయణ చేతులు మీదుగా కేక్ ను కట్ చేసి వేడుకలు ప్రారంభించారు. తరువాత థియేటర్ సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం మేనేజర్ సత్యనారాయణను జిల్లా చిరంజీవి యువత సత్కరించారు. ఈ సందర్బంగా జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ… మా అందరికి ఆదర్శమైన మా ఆరాధ్యదైవాలు చిరంజీవి, నాగేంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఆదర్శంగా తీసుకొని సేవల్లో ముందుకెళ్తామని, వారి ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళటమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. అనంతరం ఈ సందర్బంగా ఈ మధ్యనే కృష్ణా థియేటర్ మేనేజర్ మామిడి పరుశరామ్ కు శివాలయమ్ వీధిలో ఉన్న శివాలయం ఆలయ కమిటీ సభ్యునిగా అయినందుకు జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో కృష్ణా థియేటర్ లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత, జనసేన ముఖ్య నాయకులు మరియు అల్లు అర్జున్ అభిమాన సంఘం అధ్యక్షులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్,జనసేన యువనాయకులు లోపింటి కళ్యాణ్, చెల్లూరి ముత్యాల నాయుడు, జిల్లా చిరంజీవి యువత గౌరవ సలహాదారులు సారికి మురళి మోహన్, సభ్యులు సాయి, అప్పన్న, లంకాపట్నం కుమార్, సూరిబాబు, ఉదయ్, పైడిరాజు, జి. సురేష్, రవి, కులదీప్, కొమ్మాజీ సాయిప్రకాష్, అరవింద్, పిల్లి సతీష్, బెలగాన చందు, చందక రాజారావు, అలబోయిన శివ, మదన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.