రైతులుకు 9 గంటలు కరెంటు ఇవ్వాలి – కరెంటు కోతలు ఎత్తి వెయ్యాలి

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం, అవనిగడ్డ ప్రస్తుతం అవనిగడ్డ నియోజకవర్గంలో రైతులకు 9గంటలు ఇవ్వవలిచిన కరెంటు కేవలం 3 గంటలు ఇవ్వటం చాలా దారుణం, అలాగే వేళా పాల లేకుండా కరెంటు ఆపివెయ్యటం గ్రామీణ ప్రాంతాలలో సుమారు 10 గంటలు పైన ఆపివెయ్యటం వలన ప్రజలు నరక వేతన పడుతున్నారు. రైతులు కు 3 గంటలు కరెంటు ఇవ్వటం వలన మెట్ట ప్రాంత రైతులు తమ పొలాలు కళ్ళముందే ఎండిపోతుంటే దిక్కు లేనిపరిస్థిలో రైతులు ఉన్నారు. మామిడి, జమా, బొప్పాయి, అరటి, కూరగాయలు తోటలు నీరు లేక కరెంటు మోటార్స్ పని చెయ్యక నోటికాడికి వచ్చిన పంటలు పాడుయిపోయి రైతులు అప్పులు పాలు అవుతున్నారు.ఎండలు చూస్తే రోహిణి కార్తీనీ మించి ఉన్నాయి, ఉక్కపొతాలు వలన గ్రామాలలో చిన్నపిల్లలు, ముసలి వారు, అనారోగ్యం పాలు అయినవారు కరెంటు కోతలు వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వానికి ముందుచూపు ఆలోచన లేక పోవటం వలన ప్రజలు ఇబ్బంది పడుచున్నారు. ఒక ప్రక్కన కరెంటు చార్జీలు పెంచటం చాలా సిగ్గు చేటు అయిన విషయం. కావున రాష్ట్ర ముఖ్య మంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రైతులకు 9 గంటలు కరెంటు ఇవ్వాలి, కరెంటు కోతలు వెంటనే ఎత్తి వెయ్యాలి అనీ జనసేన పార్టీ తరుపున కోరుచున్నామని జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ రావు అన్నారు.