జగన్మోహన్ రెడ్డి నేటితో సీఎంగా ఉండే అర్హత కోల్పోయారు..!: కుంటిమద్ది జయరాం రెడ్డి

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారికంగా జరుగుతున్న బహిరంగ సభలో… కొన్ని వేల మంది విద్యార్థుల ముందు బహిరంగంగా.. నా వెంట్రుకలు ఎవరూ పీకలేరు! అని మాట్లాడటం నేరం ఘోరమైన చర్య

వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నేటితో ఆంధ్ర ప్రదేశ్ సీఎం గా ఉండడానికి అర్హత కోల్పోయారు! భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు, భారత రాజ్యాంగం విలువల్ని, స్పూర్తిని విస్మరించడం దారుణమైన, నీచమైన,హేయమైన చర్య. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఎవరి వెంట్రుకలు? ఎవరూ? పీక్కోవలసిన అవసరం లేదు.. మీకు తెలుసో లేదో రాష్ట్రంలో కోడి కత్తి డ్రామా ఒకప్పుడు నడిచింది.. ఆ కోడికి అయితే మాత్రం బొచ్చు పీకుతారు.

మరోవైపు రాష్ట్రంలో దొంగలు ఎవరో? దొరలు ఎవరో? రాష్ట్ర ప్రజలకు తెలుసు. దొంగే… దొంగా దొంగా అని ఎదుటివారిని అంటుంటే చాలా విడ్డూరంగా ఉంది… దయ్యాలు నీతులు వల్లించినట్లు… అంటూ అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్ట్రాంగ్ గా సమాధానమిచ్చారు.