అనంతపురం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యుల సమావేశం

అనంతపురం జిల్లా కార్యనిర్వహణ కమిటీ సభ్యుల సమావేశంలో జనసేన పార్టీ కార్య నిర్వహణ కమిటీ కో- ఆర్డినేటర్ కళ్యాణం శివ శ్రీనివాస రావు – కెకె, అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ టి.సి. వరుణ్, కార్యనిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి భవానీ రవి కుమార్, అనంతపురం జిల్లా నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, విశ్వనాథ్, కార్యదర్శి సురేష్, సంయుక్త కార్యదర్శి ముత్యాలు (సిద్దు) అనంతపురం జిల్లా నుంచి నూతనంగా ఎన్నుకోబడిన కార్య నిర్వహణ కమిటీ సభ్యులకు పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఎంతో క్రమశిక్షణతో మెలిగి అధినేత పవన్ కళ్యాణ్ సభా కార్యక్రమాలను విజయవంతం చెయ్యాల్సిన బాధ్యత మనపై ఉందని రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది అని వైసీపీ పార్టీకి దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజాక్షేమంపై ఆలోచన లేదని ఈ క్రమంలోనే రాష్ట్రంలో అప్పుల బాధలు తట్టుకోలేక పండిన పంటలు చేతికి రాక తీసుకున్న అప్పులు కట్టలేక బ్రతుకు భారంగా భావించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను ఆదుకోవాలని భావించి అధినేత పవన్ కళ్యాణ్ 12.04.22(మంగళ వారం) అనంతపురం జిల్లాకు విచ్చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం కోసం జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయలు విరాళంగా అందించిన తెలిసిందే. 2014 లో టీడీపీ ప్రభుత్వం, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దొందూ దొందే అని వీరికి వీరి సొంత ఆస్తుల ను పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు మంచి చెయ్యడంలో లేదు.కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయం.కావున ప్రతి నియోజకవర్గంలో కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడాలని ఈ సమావేశానికి విచ్చేసిన నాయకులు కమిటీ సభ్యులకు వివరించడం జరిగింది. జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులుగా నియమించినందుకు ప్రతి ఒక్కరూ అధినేత పవన్ కళ్యాణ్, రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ లకు, నాయకులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీరు ఇచ్చే బాధ్యతను క్రమం తప్పకుండా నిర్వహిస్తాం అని తెలిపారు.